లైంగిక ఆరోపణలపై బీర్కూర్ పీహెచ్ సి మెడికల్ ఆఫీసర్ పై కేసు
బాన్సువాడ, బతుకమ్మ : లైంగిక ఆరోపణలపై బీర్కూర్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ పై బీర్కూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లైంగిక వేధింపులకు ఓ మహిళా ఉద్యోగి పి హె సీ వైద్యాధికారి లింగాల నాగ గిరీష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు బీర్కూర్ పోలీసులు కేసు నమోదు చేసి, వైద్యాధికారి లింగాల నాగ గిరీష్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఇన్‌ఛార్జి డిప్యూటీ డీఎంహెచ్‌వో...