న్యాయవాదిపై దాడి కేసులో ముగ్గురిపై కేసు

0 1,098

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : న్యాయవాది ఖలీద్ పై జరిగిన దాడి కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు 2వ టౌన్ ఎస్సై యాసద్ అర్పాద్ తెలిపారు. ఖిల్లాలోని న్యాయవాది ఖాసీంకి సంబంధించిన ఒక షట్టర్ రూమ్ ను తమకు అమ్మాలని అర్షద్ ఖాన్, ముజఫర్ ఖాన్, ముజాహిద్ ఖాన్ అనే ముగ్గురు చాలా రోజుల నుంచి అడుగుతున్నారన్నారు. ఆదివారం రాత్రి అర్షద్ ఖాన్, అతని ఇద్దరు కొడుకులు న్యాయవాది ఖాసీం తన షట్టర్ లో ఉండగానే అతనితో వాగ్వాదానికి దిగారన్నారు. నువ్వు షట్టర్ మాకు అమ్మి ఇక్కడి నుండి వెళ్లిపోవాలని అతనిపై దాడి చేసినట్లు తెలిపారు. దీంతో న్యాయవాది కొడుకు ఖలీద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.