29 C
Hyderabad
Monday, August 3, 2026

మేడిపల్లి శివారులో కారు, బైక్ ఢీ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇద్దరికి గాయాలు

 

గాంధారి, బతుకమ్మ :

 

గాంధారి మండలం మేడిపల్లి హనుమాన్ నాయక్ తండా కి చెందిన గంగా సింగ్ (35), యమునా (50) ఆదివారం మేడిపల్లి శివారులో ప్రమాదానికి గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గంగా సింగ్, యమునా ఒకే బైక్ పైన హనుమాన్ నాయక్ తాండ నుంచి గాంధారి మార్కెట్ కోసం బయలుదేరారు. కామారెడ్డి నుండి బాన్సువాడకు వెళ్తున్న కారు మేడిపల్లి శివారు వద్ద గంగా, యమున వెళ్తున్న భైక్ ను ఢీ కొంది. కారు, బైక్ ఢీ కొనడంతో రెండు కూడా డివైవర్ కింద పడిపోయాయి. రోడ్డు కింద ఉన్న గుంతలో పడి పోవడంతో బైక్ పైన ఉన్న గంగా సింగ్ కి తొడ ఎముక టిబ్యా అండ్ ఫిబుల బోన్ ఫ్యాక్చర్, యమునకి క్లావికల్ బోన్ ఫ్యాక్చర్ అయ్యాయి. కారు లో ప్రయాణిస్తున్న వారికి చిన్నగా అబ్రివేషన్ అయ్యాయి. వీరికి సిపి డాక్టర్ శ్రీకాంత్ సహాయంతో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి మెడికవర్ హాస్పిటల్ కు తరలించారు.

More articles

Latest article