హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ జేఎన్టీయూ వంతెనపై ఆదివారం ఉదయం కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో మొదట డివైడర్ ను, ఆ తర్వాత ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి కారు బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. యువకులను సుడాన్ దేశస్థులుగా గుర్తింంచారు. సూడాన్ కు చెందిన యువకులు నగరంలో చదువుకుంటూ శంషాబాద్ లో నివాసముంటున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.