- డీఈఓను కోరిన ఎన్ఎస్ యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణు రాజ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : న్యాల్కల్ రోడ్‌లో ఉన్న ఆర్చిడ్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఎన్ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణు రాజ్ జిల్లా విద్యాశాఖ అధికారి కి వినతిపత్రం అందజేశారు. అనంతరం వరద బట్టు వేణు రాజ్ మాట్లాడుతూ న్యాల్కల్ రోడ్‌లో ఉన్న ఆర్చిడ్ పాఠశాల విద్యా ప్రమాణాలేవి పాటించడం లేదని, కావున ఆ యొక్క పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యాశాఖ అధికారిని కోరడం జరిగిందని అన్నారు. ఆర్చిడ్ పాఠశాలలో విద్యార్థుల భద్రత, విద్యా ప్రమాణాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతున్నాయని, విద్యార్థులకు తగిన వసతులు లేవని, పాఠశాలలో బోధనా సిబ్బంది కి సరైన అర్హతలు కలిగి లేరని అలాగే స్కూల్ యాజమాన్యం విద్యను వ్యాపారంగా మార్చి నిబంధనలకు విరుద్ధంగా వేల రూపాయల ఫీజ్ ను తల్లిదండ్రుల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగ ఇబ్బందికి గురి చేస్తూ పాఠశాలలో పనిచేసే సిబ్బందికి జీతాలు సైతం సరిగా ఇవ్వడం లేదని అన్నారు. ఆ స్కూల్‌కి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ లేదని, మున్సిపల్ అనుమతి కూడా లేకుండా పాఠశాలను నడుపుతున్నారని,ఇది విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదమని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆర్చిడ్ పాఠశాల యాజమాన్యంపై తక్షణ విచారణ జరిపి, సంబంధిత స్కూల్ యాజమాన్యం పై తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను కోరామని అన్నారు. ఈ కార్యక్రమ లో ఎన్ఎస్ యుఐ నాయకులు శివ, నిఖిల్ రెడ్డి, కౌశిక్, సాయికిరణ్, తదితరులు పాల్గొన్నారు.

