22 C
Hyderabad

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వెంటనే రాజీనామా చేయాలి

BRS MLC Tata Madhu must resign immediately.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

 

 . . కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ డిమాండ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ ఎస్ ఎమ్మెల్సీతాతా మధు వెంటనే రాజీనామా చేయాలని కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ జిల్లా కాంగ్రెస్ భవన్ లో   విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఉద్దేశ్య పూర్వకంగా చేసిన చేసిన అనుచిత వ్యాఖ్యల వెనుక మాజీ సీఎం కేసీఆర్ ప్రోద్బలం ఉందని, కేసీఆర్ ను, ఎమ్మెల్సీ తాత మధును వెంటనే  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల ప్రోత్సాహంతో,  ప్రోద్బలంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసెంబ్లీ స్పీకర్ దళిత నేత గౌరవ గడ్డం ప్రసాద్ కుమార్ ని,వాళ్ళ దివంగత అమ్మను బూతులు తిడుతూ దుర్భాషలాడడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఆధిపత్య కుల అహంకారంతో అసెంబ్లీ దళిత స్పీకర్ ను బహిరంగంగా  అవమానించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని రాష్ట్ర డీజీపీని కోరుతున్నామన్నారు. అదే విధంగా ఎమ్మెల్సీ పదవి నుండి శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించాలని తెలిపారు. ఎర్రవెల్లి ఫాం హౌస్ లో జరిగిన బీఆర్ఎస్ ఎల్ ఎపీ సమావేశం లో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను రెచ్చగొట్టి అసెంబ్లీ కి పంపి ఎమ్మెల్సీ తాతా మధుతో స్పీకర్ ను బూతులు తిట్టించిన మాజీ సీఎం కేసీఆర్ పై కూడా ఎస్సీ, ఎస్టీఅట్రాసిటీ కేసు నమోదుచేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామని బొబ్బిలి రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్, ఈఆర్ వో కో ఆర్డినేటర్ అబ్దుల్ వహీద్,టౌన్ డిసిసి ఉపాధ్యక్షులు సలీం, కార్పొరేటర్ ప్రవీణ్ గౌడ్, ఎర్రం గంగాధర్, కో ఆప్షన్ మెంబర్ బొబ్బిలి మురళీ, సకినాల శివ ప్రసాద్, జిల్లెల రమేష్, అమరాజు, సాయి బసవ, వహీద్, అపర్ణ, ఆకుల శ్రీశైలం, మల్లేష్ యాదవ్, బండారు రమేష్, మహమ్మద్ సముద్దీన్, సయ్యద్ అర్షద్, షేక్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article