వెబ్ డెస్క్, బతుకమ్మ :
ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి సయానిని, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు వేర్వేరుగా కలిశారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకుని అసెంబ్లీ వద్ద పోలీసులు తమపై జరిపిన దాడి తీరును మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి వారికి వివరించారు. బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తూ అవమానించారని, అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, శాసనసభ్యులుగా తమ హక్కులకు విఘాతం కలిగించేలా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందని ఈ సందర్భంగా వారు మానవ హక్కుల కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేశారు.
