భీమ్ గల్, బతుకమ్మ :
భీమ్ గల్ మున్సిపల్ కౌన్సిలర్లు సీ హెచ్. గంగాధర్(6వార్డ్), దారావత్ లింగయ్య నాయక్(2వ వార్డ్) లు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి తో పాటు భీమ్ గల్ సొసైటీ డైరెక్టర్ దుబ్బాక దశగౌడ్,భీమ్ గల్ మాజీ సర్పంచ్ బాల గంగాధర్, భీమ్ గల్ సర్వ సమాజ్ అధ్యక్షులు సేవ్వ ఆశోక్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనకు ఆకర్షతులై బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండ్వా కప్పుకొన్నారు.వీరితో పాటు కోప్షన్ ఇక్రమ్, అక్రమ్, అహ్మద్ లు చేరారు. ఇప్పటికి కాంగ్రెస్ లో చెరిన కౌన్సిలర్ ల సంఖ్య 3 కు చెరింది. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల నాయకులు కన్నె సురేందర్, మూడేడ్ల జితేందర్, జె జె నర్సయ్య, పర్స అనంత్ రావు, చెప్పాల గణేష్, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
