29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆర్టీసీ బస్సు ఢీకొని బాలునికి గాయాలు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో బోధన్ నుండి బాన్సువాడ వెళ్తున్న టీఎస్ యుబి 3300 నంబర్ గల ఆర్టీసీ బస్సు అక్బర్ నగర్ లో 8 ఏళ్ల కల్దుర్కి సిద్దార్థను ఢీ కొనడంతో తీవ్రగాయాల పాలయ్యారు. గాయపడిన బాలుడిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పటికీ బస్సు డ్రైవర్ బస్సుని ఆపకపోవడంతో అక్బర్ నగర్ గ్రామ యువకులు మాట్రిక్స్ స్కూల్ వద్ద బస్సును నిలిపివేసి ఆందోళన చేశారు. సంఘటన స్థలానికి రుద్రూర్ ఎస్సై మనోజ్ కుమార్ చేరుకొని ఆందోళనకారులను నచ్చజెప్పి బస్సును రుద్రూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Boy injured after being hit by RTC bus

More articles

Latest article