29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

పీడీఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బోల్గురి కిరణ్ కుమార్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రధాన కార్యదర్శిగా ఎన్. బాల్ రాజ్ ఎన్నిక

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఫ్రంట్ (పీడీఎస్‌ఎఫ్) తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికైంది. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర నిర్మాణ జనరల్ బాడీ సమావేశంలో 11 మంది సభ్యులతో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బోల్గురి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎన్. బాల్ రాజ్ ఎన్నికయ్యారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం, నాణ్యమైన విద్య అందరికీ అందేలా ఉద్యమాలను మరింత విస్తృతం చేయడమే తమ కమిటీ లక్ష్యమని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర అధ్యక్షుడు బోల్గురి కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీ, ఫీజు రీయింబర్స్‌ మెంట్, స్కాలర్‌షిప్‌లను సకాలంలో చెల్లించడం, హాస్టల్ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. నూతన విద్యా విధానం (ఎన్ఈపీ – 2020) లోని విద్యార్థి వ్యతిరేక అంశాలను వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ విద్యను పరిరక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్యాభివృద్ధికి పీడీఎస్‌ఎఫ్ కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా పలువురు విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. కొత్త నాయకత్వంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మరింత బలమైన ఉద్యమాలు కొనసాగుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పీడీఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీలో అధ్యక్షుడుగా బోల్గురి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎన్.బాల్ రాజ్, ఉపాధ్యక్షులుగా వి.సైదులు, పి.అనిల్ కుమార్, సహాయ కార్యదర్శిగా వి.నవీన్ కుమార్, కోశాధికారిగా బి.నవీన్ కుమార్, కమిటీ సభ్యులుగా పి.సాయి కుమార్, ఎ. విజయ్ కుమార్, కె. అంజి బాబు, ఎం. సూర్యకాంత్ లు ఎన్నికయ్యారు. పీడీఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ విద్యార్థుల హక్కుల కోసం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని ప్రకటించింది.

More articles

Latest article