బోధన్ మున్సిపల్ సమావేశం రసాభాస
. . . ఆందోళనకు దిగిన ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు బోధన్, బతుకమ్మ : బోధన్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం చైర్మన్ పద్మ శరత్‌రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఏజెండా అంశాలపై చర్చించకుండానే సమావేశాన్ని ఐదు నిమిషాల్లో ముగించడంపై ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు.ఇటీవల గణేష్ ఉత్సవాలకు ఖర్చు చేసిన రూ.16 లక్షల నిధుల వివరాలు వెల్లడించాలని, స్లాటర్‌హౌస్ పనులు ఎందుకు ప్రారంభించలేదో చెప్పాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. తమ వార్డుల సమస్యలను ప్రస్తావించేందుకు...