బతుకమ్మ, బోదన్:
బోదన్ పట్టణంలోని సార్వజనిక్ గణేష్ మండలి లడ్డు వేలంలో రూ.1.40 లక్షలకు ఎడపల్లి మండలం ఎరాజ్ పల్లికి చెందిన సిహెచ్ సాయిరెడ్డి దక్కించుకున్నారు. తోమ్మిది రోజుల పాటు విశేష సేవలందుకున్న గణ నాధుడి వద్ధ ఉన్న లడ్డుకు వేలం పాటను దక్కించుకున్న సాయిరెడ్డికి బోదన్ ఎమ్మెల్యే సుధర్శన్ రెడ్డి, బోదన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో లడ్డును అందచేశారు. సార్వ జనిక్ గణేష్ మండలి లడ్డుకు రికార్డు ధర పలుకడం కలకలం రేపింది.
