. అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో అరెస్ట్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: హిందూ ధర్మం రక్షణ కోసమంటూ ఏర్పడిన రామరాజ్యం ఆర్మీ వ్యవహారం చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి ఘటనతో వెలుగు చూసింది. ఈ ఆర్మీలో పని చేస్తున్న బోధన్ కు చెందిన సాయినాథ్ ను పోలీసులు అరెస్టు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రంగరాజన్ పై దాడి కేసులో పోలీసులు సాయినాథ్ ను అరెస్టు చేశారు. 2022 నుంచి రామరాజ్యం ఆర్మీలో పని చేస్తున్న సాయినాథ్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. రామరాజ్యం ఆర్మీలో జిల్లా కుచెందిన వారిని ఎవరినైనా సాయినాథ్ చేర్చాడా? జిల్లాలో అర్చకులను ఎవరినైనా బెదిరించాడా అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.
