27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బీఎంఎస్ నిజామాబాద్ డివిజన్ కార్యవర్గం ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్ (BMS) నిజామాబాద్ డివిజన్ నూతన కార్యవర్గంను నగరంలో గల వర్ని చౌరస్తాలోని విద్యుత్ భవన్ లో ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట పవర్  ఎంప్లాయిస్ యూనియన్ రి.నెం.G.445 (భారతీయ మజ్దూర్  సంఘ్ అనుబంధం) నిజామాబాద్ డివిజన్ నూతన కార్యవర్గన్ని జిల్లా అధ్యక్షులు బాధవత్ సంతోష్ కుమార్ ప్రకటించారు. నూతన  అధ్యక్షులుగా మాలోత్ రతన్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా సబ్బని నవీన్ కుమార్, వర్కింగ్ ప్రసిడెంట్ గా సుంకరి నరేష్, ట్రేజరర్ గా పెరుమాండ్ల రాజేష్, ఉప అధ్యక్షులుగా ఎన్.ప్రశాంత్ లతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో  నిజామాబాద్ జిల్లా కార్యదర్శి టీ.మహేందర్ గౌడ్, లాడే రమేష్,  స్వప్న, పద్మ విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు.

More articles

Latest article