బతుకమ్మ, భిక్కనూరు: బిసి రిజర్వేషన్లు అడ్డుకుంటున్న వ్యతిరేకులకు తగిన బుద్ధి చెప్తామని భిక్కనూరు ముదిరాజ్ సంఘం ప్రతినిధులు సోమవారం అన్నారు.ఈ సందర్భంగా గంగల రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే అగ్రకుల నాయకులు రెడ్లు అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే హైకోర్టులో స్టే వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తక్షణమే పిటిషన్స్ విత్ డ్రా అయ్యేలా ప్రభుత్వం వ్యవహరించాలని మండిపడ్డారు. గతంలో ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మేము వ్యతిరేకించలేం, మరి ఇప్పుడు అగ్రకుల నాయకులు బీసీల 42% రిజర్వేషన్ ను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిసి నాయకులు బత్తుల లక్ష్మీ నర్సింలు, బండి ఎల్లయ్య, గంగాధర్, గజ్జె వేణు ఉన్నారు.
