29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా బిజెపి 46వ ఆవిర్భావ దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు  మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో బిజెపి 46 ఆవిర్భావ దినోత్సవం సోమవారం ఘనంగా జరిగాయి. బిజెపి జిల్లా కార్యదర్శి రాయపల్లి సంతోష్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశాన్ని విశ్వ గురువుగా చేయాలన్నదే బిజెపి పార్టీ ముఖ్య ఉద్దేశం అని 2047 సంవత్సరం నాటికి వికసిత్ భారత్ భాగంగా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందుతుందని పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామంలో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ఉప్పరి రమేష్ బీజేపీ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి మండల శాఖ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article