25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కళాశాలల బంద్ కు బీజేపీ మద్దతు

Must read

📰 Generate e-Paper Clip

  • బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలు సోమవారం నుంచి చేపట్టిన నిరవధిక బంద్ కు బీజేపీ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో విద్యా రంగం సంక్షోభంలో కూరుకు పోయిందన్నారు. వేలాది కాలేజీలు బంద్ పాటించడంతో లక్షలాది విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రూ.10,500కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని 2,500 ప్రైవేట్ విద్యా సంస్థలు నిరవదిక బంద్ కు దిగడం రాష్ట్ర విద్యారంగం ఎంత  దయనీయ స్థితికి చేరిందో స్పష్టంగా తెలస్తుందన్నారు. వెంటనే బకాయిలను విడదల చేసి విద్యార్థుల భవిష్యత్తును ఆదుకోవాలని కోరారు.

More articles

Latest article