కళాశాలల బంద్ కు బీజేపీ మద్దతు
బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలు సోమవారం నుంచి చేపట్టిన నిరవధిక బంద్ కు బీజేపీ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో విద్యా రంగం సంక్షోభంలో కూరుకు పోయిందన్నారు. వేలాది కాలేజీలు బంద్ పాటించడంతో లక్షలాది విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత బీఆర్ఎస్...