30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇందూరులో బీజేపీ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా ఇందూరు నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో శనివారం బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా నాగోళ్ళ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ ఇంతటి విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ లో 48 సీట్ల పైచిలుకు బిజెపి విజయం సాధించి తిరుగులేని శక్తిగా ఎదిగిందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ తన అవినీతి సొమ్ముతో ఢిల్లీలో గెలవాలని ఆశించి ప్రజలు ఇచ్చిన తీర్పుకు భంగపాటు తప్పలేదన్నారు. ఘోర ఓటమిపాలై అవినీతి పాల్పడిన ప్రతి నాయకున్ని ఓడించే సత్తా ప్రజలకు మాత్రమే ఉందని మరొకసారి ఢిల్లీ ప్రజలు రుజువు చేశారని తెలిపారు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ అనేది దేశంలోనే అవినీతి లేని ప్రభుత్వంగా ప్రజల మన్ననలను పొందిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో బీజేపీ మండల అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

BJP celebrations in Indore

More articles

Latest article