27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నగరంలో బిపాషా ఖాన్ హల్ చల్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: హైదరాబాదీ ట్రాన్స్ జెండర్ బిపాషా ఖాన్ నిజామాబాద్ నగరంలో హల్ చల్ చేసింది. నగర శివారులోని ఆటోనగర్ ప్రాంతంలో ఓ వివాహ వేడుకకు ట్రాన్స్ జెండర్ బిపాషాఖాన్ తోపాటు మరో హిజ్రా, మహిళ హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీజే ఏర్పాటు చేసి డ్యాన్సులు చేస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. డీజేని బంద్ చేయించి బిపాషాఖాన్ తోపాటు ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేసినప్పటికీ బిపాషా తప్పించుకున్న వెళ్లిపోయినట్లు తెలిసింది.

Bipasha Khan is a hot topic in the city.

రేవ్ పార్టీ అని పుకార్లు..

నగరంలో రేవ్ పార్టీ జరిగిందని, పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారని ఆదివారం ఉదయం నగరంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. అయితే చివరకు తేలింది ఏమిటంటే వివాహ వేడుకకు హైదరాబాద్ ఫేమస్ ట్రాన్స్ జెండర్ బిపాషా ఖాన్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా డ్యాన్స్ లు చేసినట్లు స్పష్టమైంది. పోలీసులు చేరుకున్న సమయంలో ఘటనాస్థలంలో పెళ్లి ఇంటి వారితోపాటు పలువురు రౌడీషీటర్లు ఉన్నట్లు సమాచారం.

More articles

Latest article