నగరంలో బిపాషా ఖాన్ హల్ చల్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: హైదరాబాదీ ట్రాన్స్ జెండర్ బిపాషా ఖాన్ నిజామాబాద్ నగరంలో హల్ చల్ చేసింది. నగర శివారులోని ఆటోనగర్ ప్రాంతంలో ఓ వివాహ వేడుకకు ట్రాన్స్ జెండర్ బిపాషాఖాన్ తోపాటు మరో హిజ్రా, మహిళ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజే ఏర్పాటు చేసి డ్యాన్సులు చేస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. డీజేని బంద్ చేయించి బిపాషాఖాన్ తోపాటు ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం...