బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో గల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ మల్లన్న గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మోర్తాడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యాల రాములు, గ్రామ శాఖ అధ్యక్షులు దేవేందర్, మహేష్, శ్యామ్ గౌడ్, అనిల్, రాజు, సంఘం సభ్యులు నరేష్, మహేష్,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

