రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలంలోని చిక్కడ్ పల్లి గ్రామంలో లబ్ధిదారులు సుదర్శన్ గౌడ్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యింది. మంగళవారం స్థానిక మండల కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, జహిరాబాద్ పార్లమెంట్ దిశ కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, మాజీ జెడ్పిటిసి నారోజి గంగారం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి రాము, తోట సంగయ్య, రవి, మోహన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
