29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా బీరప్ప ఆలయ వార్షికోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

 

 బతుకమ్మ బోధన్ :

బోధన్ పట్టణం 18వ వార్డులో కుర్మా సంఘం ఆధ్వర్యంలో బీరప్ప ఆలయ వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వామివారిని ప్రతిష్టించి సంవత్సరం పూర్తవడంతో ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సందడితో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణం తో నిండిపోయాయి. ఆలయానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరయ్య, శంకర్, పోశెట్టి, సాయిలు, రాజు తదితరులు, యువకులు పాల్గొని ఆలయ వార్షికోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Beerappa Temple Anniversary Celebrations in a Grand Manner

More articles

Latest article