- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ అధికారులకు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గారి కార్యాలయంలో సీజనల్ వ్యాధులపై నిర్వహించిన డివిజన్ స్థాయి సమావేశానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామ, వార్డు పరిధిలో వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అదేవిధంగా ఆరోగ్య ఉపకేంద్ర పరిధిలో మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం మరియు ఆశా కార్యకర్తలు గృహ సందర్శనలో జర సర్వే నిర్వహించి, అనుమానిత కేసులకు ,చికిత్స అందించాలని, నీటి నిల్వలను గుర్తించి వాటిని తొలగించేలా గ్రామస్థాయి మరియు మునిసిపల్ అధికారులకు సమాచారం అందించాలని, నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయించాలని, క్లోరినేషన్ అందుబాటులో లేని ప్రదేశాల్లో క్లోరిన్ మాత్రలను ప్రతి గృహంలో అందజేయాలని, క్లోరినేషన్ తర్వాత లాగ్ బుక్ లో ఎంటర్ చేసి తగు సూచనలు అందజేయాలని, ముఖ్యంగా గ్రామస్థాయిలో మరియు మున్సిపల్ పట్టణ వార్డు స్థాయిలో ప్రజలందరికీ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేలా విస్తృతంగా అవగాహన కలిగించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి పీఎస్సీ పరిధిలో రాపిడ్ రెస్పాన్సి టీం లను ఏర్పాటు చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ, కీటక జనిత వ్యాధుల నియంత్రణ జిల్లా అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ గారు మాట్లాడుతూ జిల్లాలో కీటక జనత వ్యాధులు ముఖ్యంగా డెంగ్యూ లాంటివి ప్రబలకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నది వివరించారు. దోమల నియంత్రణపై అందరూ దృష్టి పెట్టి దోమలు పుట్టకుండా దోమలు పుట్టకుండా జాగ్రత్త పడాలని తెలియజేశారు. డెంగ్యూ వ్యాధి గుర్తించిన గృహం చుట్టూ 50 ఇల్లు ల వరకు దోమల మందు స్ప్రే చేయాలని కోరారు. ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఇంకా ఎపిడమాలజస్ట్ డాక్టర్ వెంకటేష్ గారు మాట్లాడుతూ కుక్క కాటు వల్ల సంభవించే అనర్ధాలను తీసుకోవాల్సిన జాగ్రత్తలను, చికిత్సను, వ్యాక్సినేషన్ పై వివరించారు. అసంక్రమిక వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ సామ్రాట్ యాదవ్ గారు మాట్లాడుతూ హైపర్ టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్, ఈ సంజీవని ,ప్లాలేటివ్ , వయోవృద్ధులకు అందించే ఆరోగ్య సేవలపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ సమావేశoలో డిహెచ్ఈ గన్ పూర్ వెంకటేశ్వర్లు, గోవర్ధన్, వెంకట్ రవి, నిజాంబాద్ డివిజన్లోని అన్నిపీఎస్సీల వైద్యాధికారులు, సబ్ యూనిట్ అధికారులు, పర్యవేక్షణ అధికారులు పాల్గొన్నారు.
