- అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సెల్ ఫోన్ల వాడకంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి సూచించారు. ఈ మధ్య కాలంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో పోగొట్టుకున్న71 సెల్ ఫోన్లను బాధితులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 71 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు.

సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవ్వరైనా వారి సెల్ ఫోన్ పోయినట్లయితే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ నంబర్ ను www.ceir.gov.in వెబ్ సైటు లోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందవర్చాలని సూచించారు. అలా చేసినట్లయితే త్వరగా వారి సెల్ ఫోన్ ను పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ పద్దతిని సద్వినియోగపర్చుకోవాలని తెలిపారు.

