29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

18న బీసీ రాష్ట్ర బంద్ కు బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం మద్దతు

Must read

📰 Generate e-Paper Clip

  • బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంజయ్ తల్లారే

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 18న బీసీ రాష్ట్ర బంద్ కు బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం మద్దతు ప్రకటిస్తున్నట్లు బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంజయ్ తల్లారే తెలిపారు. బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంజయ్ తల్లారే మాట్లాడుతూ ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఏదైతే బీసీలకు రావాల్సిన వాట ఉందో అది ఇవ్వకుండా అన్యాయం చేస్తుందని అని అన్నారు. 42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ చేర్చాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని బిసి కులాల ప్రజలు బిజెపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు 18 బిసి రాష్ట్ర బంద్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉదయ్, రాకేష్, నరేందర్, మంగేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article