. . .బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్,
నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
ప్రభుత్వం నూతన పిఆర్సీ ని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి, బిసి ఉద్యోగుల కు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ కేర్ డిగ్రీ కళాశాలలో శనివారం జరిగిన బిసిటియు సమావేశం లో వివిధ మండలాల బిసిటియు కార్యవర్గాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా బిసి టియు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ సభ్యత్వ నమోదును ప్రారంభించారు .ఈ సందర్భంగా మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, జనాభా దామాషా ప్రకారం బిసి లకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. 4 పెండింగ్ డిఏ లను కూడా అమలు చేయాలని, గురుకుల ఆదర్ష పాఠశాల, కెజిబివి ల సమస్యలను పరిష్కరించాలని, బిసి లకు క్రిమిలేయర్ విధానాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్షి ఆర్ గోపాలకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ లు కంచరి రవికుమార్, కొట్టాల రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, గౌరవ సలహాదారులు రమణ స్వామి, కొట్టూరు రమేష్, కార్యదర్శులు సతీష్ కుమార్, నామాల శంకర్, మోపాల్ మండల బిసిటియు అధ్యక్షులు గంగయ్య, మాక్లూర్ మండల బిసిటియు అధ్యక్షులు గంగోనె సంజీవ్, ఇందల్వాయి మండల బిసిటియు ప్రధాన కార్యదర్షి ఇంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు.
