27.4 C
Hyderabad

 బాల్కోండ ఖిల్లా వద్ధ బాలుడి హత్య

Must read

📰 Generate e-Paper Clip

. . . నాలుగు రోజుల క్రితం మిస్సైన బాలుడి హత్య

బతుకమ్మ, బాల్కోండ:

నిజామాబాద్ జిల్లా బాల్కోండలో దారుణం  వెలుగు చూసింది. గత నాలుగు రోజుల క్రితం మిస్సింగ్ ఐనా బాలుడి కథ విషాధాంతమైంది. బాల్కోండ లోని పురాతన ఖిల్లా వద్ధ కచ్చు రాకేష్ (12) దారుణ హత్యకు గురయ్యాడు. బాల్కోండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన కచ్చు బాను, లస్మయ్యల కుమారుడైన రాకేష్ నాలుగు రోజుల క్రితం మిస్సింగ్ అయ్యాడు . బాలుడి అచూకి లభించకపోతే పోలిస్ లకు పిర్యాదు చేశారు. శనివారం ఉదయం బాలుడి మృతదేహం ఉందని స్థానికులు గుర్తించి పోలిస్ లకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది. సంఘటన స్థలాన్ని సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ నరేష్ లు పరిశీలించారు.డాగ్ స్కాడ్ ను రప్పించి  పరిశోధన ప్రారింబించారు.

More articles

Latest article