27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధవత్ నరేందర్

Must read

📰 Generate e-Paper Clip

 

కరీంనగర్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధవత్ నరేందర్ ని ఎన్నుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ తెలిపారు. సోమవారం కరీంనగర్ లోని ఒక రిసార్ట్లో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గీతా ఆఫీస్ నుండి ధర్మేందర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల సురేష్ హాజరయ్యారు. అనంతరం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బాధవత్ నరేందర్ ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా దీపక్, మహేష్, సాయికుమార్, సెక్రెటరీగా గోపి, సూర్య, కార్తీక్, వంశీ, జాయింట్ సెక్రటరీగా సాయి, రాజు, శ్రీకాంత్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 

Badhwat Narender elected as president of Allu Arjun Fans Association

More articles

Latest article