కుల గణనపై అవగాహన

0 1,051

బీబీపేట్, బతుకమ్మ : బీబీపేట్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక స్థతి, కుల గణన 2011 సన్సెస్ ప్రకారం జనాభా లెక్కలపై గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జనాభా లెక్కలు చేసి దానిపై సోషల్ ఎకానమిక్ సర్వే నిర్వహించబడుతుందని జిల్లా ప్లానింగ్ అధికారి తెలిపారు.  మండలంలో ప్రతి 150 కుటుంబాలకు ఎన్నమనేటర్,  1500 కుటుంబాలకు ఒక సూపర్వైజర్ నియమించామని తెలిపారు. ఈ సమావేశంలో బిబిపేట్ తాసిల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ నరేందర్, మండల విద్యాశాఖ అధికారి అశోక్, మండల సూపర్వైజర్ మంగ, ఐసిడిఎస్,  పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకెపి సీసీలు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.