28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని శ్రీ చైతన్య పాఠశాలలో సైబర్ నేరాలపై  విద్యార్థులకు ఎల్లారెడ్డిపేట  ఎస్ ఐ రాహుల్ రెడ్డి అవగాహన  కల్పించారు.సైబర్ నేరాలపై పాఠశాలలో నిర్వహించిన అవగహన కార్యక్రమంలో పాల్గొని ఎస్ ఐ మాట్లాడారు.విద్యార్థులకు  ఏపీకే ఫైల్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, లోన్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, సైబర్ మోసాలకు పాల్పడే నేరస్థుల నుండి విద్యార్థులు ఎలా సురక్షితంగా వుండాలి అన్న విషయాలను వివరించారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లను సక్రమంగా నిర్వహించడం, సురక్షితంగా ఉపయోగించడం మొదలైన అంశాలపై  ఎల్లారెడ్డిపేట ఎస్సై కే రాహుల్ రెడ్డి విద్యార్థులకు వివరించారు . ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సైబర్ వారియర్ శ్రీనివాస్, ప్రిన్సిపల్, టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article