రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సి కాలనీలో రుద్రూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యంలో మంగళవారం టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆరోగ్య విస్తీర్ణ అధికారి కే. శ్రీనివాస్ మాట్లాడుతూ.. టీబి వ్యాధి వచ్చినట్లయితే రెండు వారాల కంటే ఎక్కువ దగ్గు, జ్వరం, రాత్రి వేళల్లో చెమటలు, ఆకలి లేకపోవడం, కళ్ళే (తెమడ) వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. టీబి వ్యాధి పరీక్షలు నిర్వహించి నమూనాలను సేకరించామన్నారు. అదేవిధంగా 11 మందికి 102 వాహనంలో ఛాతి ఎక్సరే కొరకు జిల్లా ఆసుపత్రి బోధన్ కు పంపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రవి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.