రుద్రూర్, బతుకమ్మ : దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మూడవ రోజు బుధవారం అమ్మవారు అన్నపూర్ణ దేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో అమ్మవారి చీరల వేలం పాట, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాంగ కులస్తులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
