నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని జెండా గల్లీలో గల ప్రసిద్ద జెండా బాలాజీ దేవాలయం జాతర ఉత్సవాల సందర్భంగా 15రోజులు, ముక్కోటి ఏకాదశి రోజు లడ్డు, పులిహోర ప్రసాదం విక్రయించడానికి బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం పాటను ఈనెల 29న దేవస్థాన ఆవరణలో ఉదయం 10గంటలకు నిబంధనలకు లోబడి ఉన్నతాధికారుల పర్యవేక్షనలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 29న ఉదయం 10గంటలలోపు డిపాజిట్ చెల్లించి పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు.