25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బాలికను కిడ్నాప్ చేసి హత మార్చేందుకు యత్నం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అప్రమత్తతో కాపాడిన పోలిసులు

. . .  సవతి తండ్రిని అరెస్టు చేసిన పోలిసులు

 కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి పట్టణ పోలిసులు బాలిక కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలో చెదించి సవతి తండ్రి చేతిలో చిన్నారి హత్యకు గురికాకుండా కాపాడారు. మంగళవారం ఉదయం జరిగిన చిన్నారి బాలిక కిడ్నాప్ ను సాయంత్రం లొపు చెదించి కాపాడినట్లు పట్టణ సిఐ నరహరి తెలిపారు.. మంగళవారం పట్టణ సిఐ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు… కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ ఎరియాలో పుట్ పాత్ లో నివశించే జంగం మమత అనే మహిళ సోమవారం రాత్రి తన కుతురు కీర్తిక( 2)తో ఆశోక్ నగర్ లో రాయల్ చికేన్ వద్ధ పుట్ పాత్ పై నిధ్రించింది. మంగళవారం ఉదయం లేచేసరికి కుతురు లేకపోవడంతో స్థానికంగా విచారించగా గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకేళ్లడని తెలుపడంతో పొలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది.  కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర, అధనపు ఎస్పీ చైతన్య రెడ్డి అదేశాలతో పట్టణ సిఐ నరహరి అధ్వర్యంలో పలు టీంలను ఎర్పాటు చేసి గాలింపు చర్యలు చెపట్టారు. సాయంత్రం మున్సిపల్ ఆపీస్ వద్ధ ఓక వ్యక్తి, చిన్నారితో వైన్స్ వద్ధ ఉండగా పోలిసులు పట్టుకుని విచారించడంతో బాలిక కిడ్నాప్ వ్యవహరం బట్టబయలైంది. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన పిల్లి రాజుకు ఇదివరకు వివాహం జరిగిన భార్య వదిలి వేల్లడంతో ఆశోక్ నగర్ కల్లుబట్టిలో పనిచేస్తున్న సమయంలో పరిచయం అయిన జంగం మమతను రెండు నెలల క్రితం గుడిలో పెళ్లి చేసుకున్నాడు. జంగం మమతకు అప్పటికి మొదటి భర్త ద్వార కిర్తీక(2) అనే కుతురు ఉండగా ముగ్గురు కలిసి జీవిస్తున్నారు. ఇటివల మమత మరో వ్యక్తితో కలువడంతో రాజుకు ఆమేకు మద్య గోడవలు జరగి ఇద్ధరు వేర్వేరుగా ఉంటున్నారు. తనను కాదని వేరేవాడితో తిరుగుతున్న మమతను భాదపెట్టాలని అందుకు కుతురును కిడ్నాప్ చేసి హత్య చేయాలని రాజు నిర్ణయించాడు. రెండు రోజులుగా మమతను వెంబడిస్తు మంగళవారం ఉదయం కిర్తికను నిధ్రలోనుంచి ఎత్తుకేళ్లాడు. దేవును పల్లి పోదలలో కిర్తికను చంపాలనుకుని దైర్యం కోసం క్వార్టర్ మద్యం సేవిస్తే ఇజీగా చంపొంచ్చు అని వైన్స్ వద్ధ రాజును పోలిసులు రెడ్ హ్య్డండేడ్ గా పట్టుకున్నారు. పోలిస్ స్టేషన్ లో విచారించగా రాజు తన ప్లాన్ గురించి తెలుపగా అరెస్టు చేసి కోర్టులో హజరు పరిచారు.

More articles

Latest article