హైదరాబాద్, బతుకమ్మ : పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులు గర్వించదగినవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంపై చేసిన దాడులను సీరియస్ గా తీసుకోవాలన్నారు. భారత సైన్యానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు మోదీ పోరాటం ఆగదన్నారు. ప్రధాని మోదీ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని చెప్పారు.
