25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బాసర ట్రిపుల్ ఐటిలో ఆర్మూర్ విద్యార్థిని అత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

బాసర ట్రిపుల్ ఐటిలో ఆర్మూర్ విద్యార్థిని అత్మహత్య

  బాసర, బతుకమ్మ :                                                                                                                                                                     

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటిలో ఓక విద్యార్థిని ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. అత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని ట్రిపూల్ ఐటి లో పియుసి -2 చదువుతున్న స్వాతి ప్రియ(17) అని తెలిసింది. ఉదయం వేళ తోటి విద్యార్థినీలు బ్రేక్ పాస్ట్ కోసం వెళ్లినప్పుడు అక్కడే హస్టల్ గదిలో ప్యాన్ కు ఉరివేసుకున్నట్టు తెలిసింది. స్వాతి ప్రియది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాల్టి పరిధిలోని పెర్కిట్ అని అధికారులు తెలిపారు. స్వాతి ప్రియ వ్యక్తిగత కారణాలతో అత్మహత్య చెసుకున్నట్టు  అనుమానిస్తున్నారు.   బాసర పొలిసులు కేసు నమోదు చేసి ధర్యప్తు చేస్తున్నారు.

More articles

Latest article