- గత సంవత్సరం మూడు నెలల్లో 40 లక్షల పని దినాలు పూర్తి
- ఆత్మీయ భరోసా పథకం రావడంతో ఆశతో చూస్తున్న కూలీలు
బతుకమ్మ,మోర్తాడ్: గ్రామాల అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషిస్తుందని తెల్పడంలో అతిశయోక్తి లేదు గ్రామాల్లోని పేదలకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అండగా నిలిచిందని అనడంలో సందేహము లేకపోలేదు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి హామీ జీవనోపాధి వరమని అనవచ్చు అటువంటి ఉపాధి పనిలో ఈ సంవత్సరం కల్పిస్తున్న పని దినాలు సరిపోతాయో లేదో అన్న ప్రశ్నార్థకంగా మిగిలింది. గత సంవత్సరం కేవలం మూడు నెలల్లోనే నలభై లక్షల పని దినాలు పూర్తయినట్లు అధికారులు గణాంకాలు తెలుపుతున్నాయి దీంతో అనేకమంది కూలీలు పని లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025 -26 ఆర్థిక సంవత్సరానికి గతంలో గ్రామసభలు నిర్వహించి పనులు గుర్తించారు. అయితే ప్రతిపాదన కేంద్రానికి పంపగా కేంద్రం నుంచి కేవలం 51 లక్షల పని దినాలకు అనుమతులు వచ్చినట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామపంచాయతీలో జిల్లా వ్యాప్తంగా 2,56,236 జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో 4, 83,762 మంది నమోదైన కూలీలు ఉన్నట్లు అధికారులకు గణాంకాలు తెలుపుతున్నాయి.
- గత ఏడాది మూడు నెలల్లోనే పని దినాలు పూర్తి
గతంలో సంవత్సరం కూలికి ఒకరోజు ₹210 చెల్లిస్తే గత సంవత్సరం 2024-25 సంవత్సరం నూతన బడ్జెట్ ప్రకారం ఒక్కరోజు ఒక కూలికి రూ. 300 చెల్లించారు. దీంతో ఉపాధి కూలీలు పనిచేయడానికి కూలీలు ఎగబడడంతో పని దినాలు ఒక సంవత్సరంకు నిర్ణయించిన బడ్జెట్ కేవలం మూడు నెలల్లోనే అయిపోవడంతో ఉపాధి పనులు నిలిపివేయాలని ఉన్నతాధికారి నుంచి ఆదేశాలు రాయడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు నిలిచిపోయాయయి. దీంతో కూలీలు అనేక ఇబ్బందులకు గురి అయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రావడంతో….
రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి పని చేసే కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ లో ఒక ఒక కూలి సంవత్సర కాలంలో 20 రోజులు పని చేస్తే సంవత్సరానికి రూ.12000 ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆత్మీయ భరోసా కార్యక్రమం ప్రారంభించడంతో ఉపాధి హామీకి పనికి వెళ్లడానికి ప్రతి ఒక్కరు పనికి వెళ్లడానికి ఆశ చూపుతున్నట్లు ఆశావాహులు తెలుపుతున్నారు.
- ఉన్నతాధికారుల దృష్టికి
- సాయ గౌడ్,(జిల్లా గ్రామీణ అధికారి),నిజామాబాద్.
గత సంవత్సరం మూడు నెలల్లో పని దినాలు పూర్తి కావడం జరిగింది. తీసుకెళ్లిన తర్వాత ఏడు లక్షల పని దినాలు అధికారులు పెంచి కూలీలకు పని కల్పించాం. ఏప్రిల్ మొదటి నుంచి నూతన ఆర్థిక సంవత్సరం పని దినాల ప్రారంభమవుతుండగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూ పని దినాలు సరిపోకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కూలీలకు పని దినాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాము.
