నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఏఐసీసీ ఆదేశాలు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిదాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2 నుండి 11 వరకు నిర్వహిస్తున్న రాజ్యాంగ పాదయాత్రలకు నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి,పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ లను కో ఆర్డినేటర్ లుగా నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గలకు కో ఆర్డినేటర్ గా తాహెర్ బిన్ హందాన్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల కో ఆర్డినేటర్ గా నగేశ్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్, బాన్సువాడ నియోజకవర్గాల కో ఆర్డినేటర్ గా శేఖర్ గౌడ్ లను నియమించారని తెలిపారు.
