ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోధించుటకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ డా.ఇ.లక్ష్మీ నారాయణ తెలిపారు. కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ – 2, ఇంగ్లీష్ – 1, భౌతిక శాస్త్రం -1, రాజనీతి శాస్త్రం – 1, హిందీ – 1, జంతు శాస్త్రం – 1, అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులతో పీజీ పాసై ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 50 శాతం సరిపోతుంది. పిహెచ్. డి. నెట్, సెట్, బోధనా అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందనితెలిపారు. ఎంపిక కళాశాల విద్యా కమీషనర్ నిబంధనల ప్రకారం ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 23 సాయంత్రం 4 గంటల లోపు తమ దరఖాస్తులు కళాశాలలో అందజేయాలన్నారు. ఇంటర్వ్యూలు జూలై 24 న ఉదయం 10 గంటలకు కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సకాలంలో హాజరు కావాలని తెలిపారు.
