భిక్కనూరు, బతుకమ్మ :
భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వర గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రఘు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రఘు మాట్లాడుతూ పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వారికి కావలసిన అన్ని సౌకర్యాలను అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.