29 C
Hyderabad
Monday, August 3, 2026

బాసర ట్రిపుల్ ఐటిలో మరో విషాదం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

బాసర ట్రిపుల్ ఐటిలో బుధవారం మరో విషాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న వసంత తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని మృతి చెందినట్టు వారు పేర్కొన్నారు. తన గదిలో నిశ్చల స్థితిలో తనని చూసిన తోటి విద్యార్థులు యునివర్సిటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో  ఆమెను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారన్నారు. వనపర్తి జిల్లాకు చెందిన వసంత ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

More articles

Latest article