24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఎడపల్లి పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలు 

Must read

📰 Generate e-Paper Clip

ఎడపల్లి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పోలీస్ స్టేషన్లో బోధన్ డివిజన్ ఏసీపీ పి. శ్రీనివాస్, బోధన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ చే వార్షిక తనిఖీలను సోమవారం నిర్వహించారు. ఈ తనిఖీలలో, రికార్డ్స్ పరిశీలించడంతో పాటు, సిబ్బంది విధులకు సంబంధించి ప్రత్యేక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సై, వారి బృందానికి సూచనలను ఇస్తూ ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, అలాగే క్రమశిక్షణతో విధులను నిర్వహించాలని సూచించారు. కొత్తగా విధుల్లో చేరిన సిబ్బంది పట్ల అంకిత భావంతో పని చేయాలని ప్రేరణ ఇచ్చారు. ఈ తనిఖీలు పోలీస్ స్టేషన్ లో మరింత సమర్థవంతమైన సేవలందించడానికి,  సిబ్బంది పనితీరు మెరుగుపరచడానికి కీలకమైన దిశను చూపించాయి.

More articles

Latest article