బతుకమ్మ,కొండగట్టు: కొండగట్టు పుణ్య క్షేత్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు పుణ్యక్షేత్రంలో శనివారం ఆంజనేయ స్వామి వారిని మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ ఈరవత్రి అనిల్ దర్శించుకు కొన్నారు. పండుగ సందర్భంగా ఆలయంలో ప్రతేక పూజలు నిర్వహించారు. శక్తి, భక్తి, ధైర్యం, సమయస్ఫూర్తికి ప్రతీక అయిన హనుమంతుడి అనుగ్రహం ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
