27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

Must read

📰 Generate e-Paper Clip

  • అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్, ట్రాలీ ఆటో సీజ్
  • ఇద్దరు వ్యక్తులు రిమాండ్ కు తరలింపు

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర గ్రామానికి చెందిన బొడ్డు మధు తన ట్రాక్టర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను శనివారం పట్టుకొని కేసు నమోదు చేసి ట్రాక్టర్ డ్రైవర్ అయిన బొడ్డు మధు ను అరెస్టు చేసి మెజిస్ట్రేట్  ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్ కు పంపినట్లు తెలిపిన ఎస్సై కే.రాహుల్ రెడ్డి. అలాగే ఈ నెల 09 న బండలింగంపల్లి గ్రామంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక గ్రామానికి చెందిన మడవేని రాజు అనే వ్యక్తి తన ట్రాలీ ఆటోలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలించగా కేసు నమోదు చేసి శనివారం అతన్ని కూడా రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై రాహుల్ రెడ్డి మాట్లాడుతూ  ఇసుక అక్రమ రవాణా పై నిఘా కొనసాగుతుందని, ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసినట్లయితే వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

An iron fist on illegal sand trafficking

More articles

Latest article