30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

వినూత్న రీతిలో కార్మికుల నిరసన

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : కార్మికులు, కష్టజీవులు రోడ్లెక్కి వివిధ రూపాల్లో అధికారుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తమ సమస్యలు పట్టించుకోవాలని ఎన్నిసార్లు విన్నవించుకున్న కండ్లతో చూసి, చెవులతో విని, నోరు మెదపడం లేదని ఆగ్రహంతో మంగళవారం రుద్రూర్ మండలంలోని ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల ప్రధాన గేటు ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కళాశాల కార్మికులు కండ్లు, చెవులు, నోరు మూసుకొని నిరసన చేపట్టారు. సీఐటీయూ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసి, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నిరసన చేపట్టామని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  మండల కన్వీనర్ మహమ్మద్ రఫీఖ్, నాయకులు రవీందర్, గంగాధర్, ఖాజా, ఉమా, విజయ, ఫర్హానా, భూమవ్వ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article