27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కిందపడి మహిళ మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మంగల్పహాడ్ గ్రామానికి చెందిన మహిళ బోధన్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న బోధన్ డిపో కు చెందిన టిఎస్ 16జడ్ 0212నెంబరు గల ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మంగల్పాడ్ చౌరస్తా వద్ద దిగింది. ఈ క్రమంలో ఆమె బస్సు ముందు నుంచి వెళ్లేటప్పుడు అది గమనించని డ్రైవర్ బస్సును నడపడంతో ముందు టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఆ మహిళ మంగళ్ పహాడ్ గ్రామానికి చెందిన చాకలి నాగమణి (64)గా గుర్తించారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Woman dies after being hit by RTC bus

More articles

Latest article