27.3 C
Hyderabad
Friday, July 31, 2026

పార్లమెంట్ లో ప్రసంగించిన విద్యార్థినిని అభినందించిన వర్సిటీ ఉపకులపతి

Must read

📰 Generate e-Paper Clip

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

పార్లమెంట్ సెంట్రల్ హాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రం నుండి ఎన్నికై ప్రసంగించిన తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగపు విద్యార్థిని కె. కీర్తనను వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి.యాదగిరిరావు, రిజిస్టార్ యం.యాదగిరి లు ఘనంగా సన్మానించారు. వారు కీర్తనకు యూనివర్సిటీ తరఫున 5 వేల రూపాయలు నగదు ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ కీర్తన ఇంకెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ కీర్తన మున్ముందు యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టలను పెంపొందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంగ్ల విభాగం అధ్యాపకులు డాక్టర్ సమత, డాక్టర్ కె. వీ రమణాచారి, డాక్టర్ జోష్ణ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య కె.అపర్ణ, యూనివర్సిటీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి లు పాల్గొన్నారు.

More articles

Latest article