పార్లమెంట్ లో ప్రసంగించిన విద్యార్థినిని అభినందించిన వర్సిటీ ఉపకులపతి

  డిచ్ పల్లి, బతుకమ్మ :   పార్లమెంట్ సెంట్రల్ హాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రం నుండి ఎన్నికై ప్రసంగించిన తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగపు విద్యార్థిని కె. కీర్తనను వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి.యాదగిరిరావు, రిజిస్టార్ యం.యాదగిరి లు ఘనంగా సన్మానించారు. వారు కీర్తనకు యూనివర్సిటీ తరఫున 5 వేల రూపాయలు నగదు ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ కీర్తన ఇంకెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ కీర్తన మున్ముందు...